June 15, 2024
మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇది తన డ్రీం ప్రాజెక్టుగా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు సినిమా పనులు జరుగుతుండగానే మరోవైపు సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వివిధ భాష స్టార్ సెలబ్రిటీలు అందరినీ కూడా విష్ణు ఈ సినిమాలో భాగం చేశారు. ఇక తెలుగులో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ కాజల్ అగర్వాల్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది అత్యంత ప్రయాసలతో కూడిన చిత్రం అని తెలిపారు. అయితే ఇది అన్ని తరాల వారు చూసే విధంగా ఉంటుందని భక్తి భావం మహాకవి ధూర్జటి ఎలా రాశారు శ్రీకాళహస్తి మహత్వం ఏమిటి అనే విషయాలన్నింటిని కూడా ఇందులో పొందపరచామని తెలిపారు.
ఇక కన్నప్ప సినిమా కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదని ఇందులో అన్ని అంశాలు ఉంటాయని వెల్లడించారు.ఇక ఈ సినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ తాను కృష్ణంరాజు గారిని కలిసినప్పుడు విష్ణు ఇలా కన్నప్ప ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నారు అన్నట్టు తనతో చెప్పాను అయితే అప్పటికే కృష్ణంరాజు ఈ కథను ప్రభాస్ కోసం రాసుకున్నారు. విష్ణు చేయాలనుకుంటున్నారని తెలియగానే ఆయన ఈ సినిమా కథను విష్ణు కోసం ఇచ్చేశారు అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే .ఈ ట్రైలర్ లో కూడా ప్రభాస్ పాత్రకు సంబంధించి ఆయన కళ్ళను మాత్రమే చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
Read More: వామ్మో మహేష్ వేసుకున్న ఈ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?