ఈ సారి ఏప్రిల్‌ పూల్ అయ్యేది ఎవరో!

January 4, 2022

ఈ సారి ఏప్రిల్‌ పూల్ అయ్యేది ఎవరో!

AprilReleases: బడా బడా సినిమాలు అన్నీ ఏప్రిల్‌లో రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్‌1న మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’, ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌ 2, ఏప్రిల్‌ 29న ‘ఎఫ్‌ 3’ సినిమాలు ఇప్పటికే కర్చీఫ్‌ వేశాయి. వీటిలో మధ్యలోనే నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రాలకే కాక మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’, విజయ్‌ ‘బీస్ట్‌’ చిత్రాలు ఏప్రిల్‌లోనే రిలీజ్‌ చేయాలని అందుకు తగ్గట్లుగా ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నాయి. ఇటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ఏప్రిల్‌ రిలీజ్‌కే ప్లాన్స్‌ చేస్తుంది. సూపర్‌హిట్‌ సాధించిన ‘బాహుబలి 2’ విడుదలైన తేదీ ఏప్రిల్‌ 28ననే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నాయి. ఈ చిత్రాలకే కాదు కొన్ని హాలీవుడ్‌ చిత్రాలు కూడా ఏప్రిల్‌నే టార్గెట్‌ చేశాయి. మరి…ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేదెవరో, ఫూల్‌ అయ్యేదెవరో. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ట్రెండింగ్ వార్తలు