May 30, 2024
మునావర్ ఫరూఖీ.. ఈ పేరు గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈయన తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని భారీగా పాపులారిటి తెచ్చుకోవడంతో పాటు ఈ సీజన్ విన్నర్ గా కూడా నిలచిన విషయం తెలిసిందే. ఇకపోతే మునావర్ ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. హాస్పిటల్ బెడ్ పై దీనస్థితిలో ఉన్న మునావర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఇదిలా ఉంటే ఇటీవలే మునావర్ రెండో వివాహం చేసుకున్న తెలుస్తోంది. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్వాలాతో కలిసి మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పది రోజుల క్రితం వీరిద్దరి వివాహం జరిగింది. ఈ జంట ఆదివారం ఐటీసీ మరాఠాలో వివాహ విందును ఏర్పాటు చేశారు. ఇక తాజాగా రెండో భార్య మెహజబీన్ తో కలిసి మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. తన భార్యతో కలిసి కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మునావర్ రెండో పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు.
అయితే అప్పటికే వీరి వివాహం గురించి నెట్టింట ప్రచారం జరిగింది. అలాగే వీరి వివాహ ఆహ్వాన పత్రిక కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. మునావర్ రెండో భార్య మెహజబీన్ మెమన్ కమ్యూనిటీకి చెందిన మహిళ. వీరు దక్షిణ ముంబైలోని అగ్రిపాద ప్రాంతంలో నివసిస్తున్నారు.
Read More: అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్న హీరో విజయ్ ఆంటోని.. జీవితాంతం చెప్పులు వేసుకోనంటూ!