‘బంగార్రాజు’ సినిమాలో సిద్ శ్రీ‌రామ్ పాడిన ‘నా కోసం’ పాట విన్నారా?

December 6, 2021

‘బంగార్రాజు’ సినిమాలో సిద్ శ్రీ‌రామ్ పాడిన ‘నా కోసం’ పాట విన్నారా?

అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమాకు క‌ళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లడ్డుండాకి మంచి ఆద‌ర‌ణే ద‌క్కింది.

ఈ రోజు సిద్ శ్రీ‌రామ్ పాడిన‌ సెకండ్ సింగిల్ `నా కోసం` పాట‌ను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా..సిధ్ శ్రీరామ్ గాత్రం బాగుంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు. ఈ పాట ఇప్ప‌టికే ఇర‌వై ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌ల‌ను సొంతం చేసుకుంది.

Read More: https://chitraseema.org/telugu-news/akhanda-fight-masters-about-movie/4696/

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ హైద‌రాబాద్‌లో జరుగుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు