ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కల్కి తీసాము.. అది సిల్లిగా అనిపించింది: నాగ్ అశ్విన్

June 15, 2024

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కల్కి తీసాము.. అది సిల్లిగా అనిపించింది: నాగ్ అశ్విన్
దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నాగ్ అశ్విన్. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ అల్లుడిగా దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కల్కి.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ రాబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్స్ భాగమయ్యారు అయితే వారందరిని డైరెక్ట్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి నేను ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ సమయమే అయింది కానీ అమితాబ్ కమల్ హాసన్ వంటి వారు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారని తెలిపారు.
అలాంటి సీనియారిటీ ఉన్నటువంటి సెలబ్రిటీలకు నేను కథ వివరించడం చాలా సిల్లిగా అనిపించిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నా తొలి సన్నివేశం అమితాబ్ గారి పైనే తీశాను ఆయన కి ఈ సినిమాలో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉన్నారని తెలిపారు. .ఇక ఈ సినిమా ప్రభాస్ దీపిక క్రేజ్ దృష్టిలో పెట్టుకొని వారి నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారనే విషయాలపైనే ఈ సినిమాలో చూపించబోతున్నాం.  అలాగే ఈ సినిమాని చిన్నపిల్లలు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు