May 14, 2024
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ ఫ్యామిలీగా మెగా కుటుంబం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నాయి. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా మరోసారి ఈ కుటుంబాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు బయటపడ్డాయని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో భాగంగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ కమెడియన్లు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడటమే కాకుండా భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభించింది. ఇక అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి తన మద్దతు అంటూ ప్రకటించారు. ఇలా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపినటువంటి అల్లు అర్జున్ ఏకంగా వైసీపీ అభ్యర్థికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడంతో సంచలనంగా మారింది. ఈ విషయంపై మెగా అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు పరోక్షంగా బన్నీపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇక ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఇదే విషయం గురించి స్పందిస్తూ పరోక్షంగా చేసినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది. మావాడైన ప్రత్యర్థికి సహాయం చేస్తే పరాయి వాడే..పరాయివాడైన మాతో ఉంటే మా వాడే అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ సంచలనగా మారింది. ఇక ఈ పోస్టుపై ఎంతో మంది నేటిజన్స్ స్పందిస్తూ అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నాగబాబు మరోసారి ఇలాంటి పోస్ట్ చేయడంతో అల్లు కుటుంబం అలాగే మెగా కుటుంబం మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది.
Read More: ప్రభాస్ కి ఓటు హక్కు లేదా.. ఓటు వేయకపోవడానికి అదే కారణమా?