ప్రభాస్ బుజ్జిని నడిపిన హీరో నాగ చైతన్య.. ఫోటోస్ వైరల్!

May 27, 2024

ప్రభాస్ బుజ్జిని నడిపిన హీరో నాగ చైతన్య.. ఫోటోస్ వైరల్!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బుజ్జి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ కోసం ఈ బుజ్జి అనే కారుని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ఈ కారుని ఆవిష్కరించారు. మూడు టైర్లతో ఆరు టన్నుల బరువున్న ఈ కారు తయారీ వెనక ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారుతో గ్రాండ్గా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఈ వాహనం చూసిన తరువాత ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతం అని కీర్తిస్తున్నారు నెటిజన్లు, వాహన ప్రేమికులు.

సినిమాలో ఈ బుజ్జి కారు పాత్ర కీలకం. ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్రతో కలిసి బుజ్జి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో ఈ కారుని తయారు చేశారట. మాటలు కూడా నేర్చిన ఈ కారుని తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వాహనాల ప్రేమికుడైన యువ కథానాయకుడు నాగచైతన్య తాజాగా బుజ్జిని కలిశాడు. కార్‌ రేసింగ్, బైక్‌ రేసింగ్‌ని అమితంగా ఇష్టపడే నాగచైతన్య బుజ్జి కార్‌నెక్కి షికారు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

బుజ్జిని నడపడం అద్భుతమైన అనుభవం. కల్కి బృందం ఇంజినీరింగ్‌ రూల్స్‌ని బ్రేక్‌ చేసింది. నేనింకా షాక్‌లో ఉన్నాను అని తెలిపారు నాగ చైతన్య. అలాగే ట్విట్టర్ లో కూడా ఆయన స్పందిస్తూ.. విజన్‌ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన చిత్రబృందానికి హ్యాట్సాఫ్‌. బుజ్జితో కలిసి గడిపిన క్షణాలు అద్భుతం. జీవితంలో ఇలాంటి కార్‌ని డ్రైవ్‌ చేస్తానని ఊహించలేదు. ఇదొక ఇంజినీరింగ్‌ మార్వెల్‌. ఊహల్ని నిజం చేసిన మొత్తం బృందానికి అభినందనలు అని రాసుకొచ్చారు.

Read More: శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి శర్వా సినిమా వచ్చేది అప్పుడే?

ట్రెండింగ్ వార్తలు