Jani Master Issue: నాగ‌బాబు సంచ‌ల‌న ట్వీట్‌…జానీ మాస్ట‌ర్ వివాదం గురించేనా?

September 19, 2024

Jani Master Issue: నాగ‌బాబు సంచ‌ల‌న ట్వీట్‌…జానీ మాస్ట‌ర్ వివాదం గురించేనా?

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌పై లైంగిక వేదింపుల‌ని వెలుగులోకి తెచ్చిన హేమ క‌మిటీ విస్తుగొలిపే నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది.. ఆ విష‌యంపై ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే తెలుగు చిత్ర పరిశ్రమలో జానీ మాస్టర్ వివాదం ప్రకంపనలు రేపుతోంది. జానీ మాస్ట‌ర్ ముస్లీం మ‌త‌స్తుడు అలాగే జ‌న‌సేన పార్టీలో యాక్టివ్ కార్య‌క‌ర్త అవ‌డంతో రాజకీయంగాను ఈ వివాదం సంచలనం అవుతోంది.

తన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు రోజుల త‌ర్వాత బెంగుళూరులోఅత‌న్ని అరెస్ట్ చేశార‌ట పోలీసులు ..ఈ విష‌యం పై ఇంకా క్లారిటీ లేదు.. అయితే ఈ అంశంపై తాజాగా స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు.

ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించకుండా నాగ‌బాబు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నేరం నిరూపితం అయ్యేవరకు ముద్దాయి నిరపరాధే’ అనే కొటేషన్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అక్కడితో ఆగకుండా మరో ట్విట్ లో విన్నవన్నీ నిజాలు కావు.. ఓ ఘటనకు మూడు రకాల కథనాలు ఉంటాయి.. నీది, అవతల వాళ్ళది, అసలు నిజం.. అంటూ ఓ ఫేమస్ రైటర్ రాసిన మ‌రో కొటేషన్ ను షేర్ చేశారు. సరిగ్గా జానీ మాస్టర్ ఎపిసోడ్ నడుస్తున్న క్రమంలోనే నాగబాబు ఇలా పోస్టులు పెట్టడంతో జానీ మాస్ట‌ర్‌కి స‌పోర్ట్ గా నిలిచేందుకే ఈ పోస్ట్ పెట్టారని నెటిజ‌న్లు మాట్లాడుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు