అదిరిపోయిన నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ .. కళ్ళజోడు గొడుగుతో సూపర్ లుక్!

May 3, 2024

అదిరిపోయిన నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ .. కళ్ళజోడు గొడుగుతో సూపర్ లుక్!

కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల నా సామి రంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత నాగార్జున పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో ధనుష్ నటిస్తున్నటువంటి కుబేర సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇకపోతే తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

గురువారం సాయంత్రం నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఒక కంటైనర్ నిండా డబ్బులు ఉంటాయి అయితే వర్షంలో నాగార్జున గొడుగు పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని సూపర్ లుక్ లో కనిపించారు. ఇలా వర్షంలో నిలబడినటువంటి నాగార్జున కంటైనర్ లో ఉన్నటువంటి డబ్బును చూస్తూ వెనక్కి తిరుగుతారు అయితే ఆయన నడుస్తూ వెళుతుండగా ఆయన పాదాల కింద ఒక డబ్బు నోటు కనబడుతుంది.

దాన్ని తొక్కబోయినటువంటి నాగార్జున తన పర్సులో ఉన్నటువంటి డబ్బులను కూడా తీసి తిరిగి ఆ డబ్బు కంటైనర్ లోనే వేస్తూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసినటువంటి అభిమానులు ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా భిన్నంగా ఉండబోతుందని భావిస్తున్నారు అంతేకాకుండా నాగార్జున లుక్ కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉందని ఈయన యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నారు అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read More: సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప టైటిల్ సాంగ్..15 దేశాలలో ట్రెండింగ్!

ట్రెండింగ్ వార్తలు