నాగార్జున అమల ప్రేమకు 32 ఏళ్ళు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

July 3, 2024

నాగార్జున అమల ప్రేమకు 32 ఏళ్ళు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు నాగార్జున అమల. వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ ఈమె నాగార్జున అని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన అమల పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు చాలావరకు దూరంగా ఉన్నారు.

ఇక నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి నాగచైతన్య జన్మించిన తర్వాత ఇద్దరు మధ్య విభేదాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న నాగార్జున తిరిగి ఇండస్ట్రీలో కొనసాగుతూనే నటి అమల ప్రేమలో పడ్డారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో కొంతకాలం పాటు కొనసాగిన తిరిగి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీళ్ళ వీరిద్దరూ 1992వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. సరిగ్గా వీరి వివాహం జరిగి 32 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఓల్డ్ అన్ సీన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నాగార్జున అమల దంపతులకు అఖిల్ జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇక అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక ఇటీవల కాలంలో అమలు కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించి సందడి చేస్తున్నారు. ఇక నాగార్జున వెండితెర, ఇటు బుల్లి తెరపై కూడా ఎంతో బిజీగా ఉన్నారు

Related News

ట్రెండింగ్ వార్తలు