నా జీవితంలో బాధాకరమైన సంఘటన అదే.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

July 9, 2024

నా జీవితంలో బాధాకరమైన సంఘటన అదే.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

Nagarjuna About Missing Naga Chaitanya Childhood Memories:  సినీ నటుడు నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పటికీ వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఇతర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల నా సామి రంగ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న నాగార్జున త్వరలోనే కుబేర అనే సినిమా ద్వారా రాబోతున్నారు.

ఇక ఈయన కెరియర్ విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దగ్గుబాటి లక్ష్మిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈయన నాగచైతన్య జన్మించగానే విడాకులు తీసుకొని విడిపోయారు అనంతరం నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ సంతానం అనే సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం చైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగార్జునకు తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఏదైనా ఉంది అంటే అది లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్యను కూడా తనతో పంపించడమేనని తెలిపారు.

అలా నాగచైతన్యను నేను పంపించాల్సి రావటంతో ఎంతో బాధపడ్డానని తెలిపారు. అయితే తన స్కూల్ స్టడీస్ మొత్తం పూర్తయిన తర్వాత నాగచైతన్య తిరిగి తన వద్దకే వచ్చి హైదరాబాదులోనే ఉన్నారు.. కానీ తన చిన్నతనం మొత్తం తాను ఎంతగానో మిస్ అయ్యానని ఈ సందర్భంగా నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు