మహేష్ బాబుతో ల‌వ్ సీక్రెట్‌ బయటపెట్టిన నమ్రత

July 1, 2024

మహేష్ బాబుతో ల‌వ్ సీక్రెట్‌ బయటపెట్టిన నమ్రత

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు మహేష్ బాబు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు కెరియర్ విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన బాలీవుడ్ నటి నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె మహేష్ బాబుతో ప్రేమలో పడటం పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం కావడం జరిగింది.

ఈ విధంగా నమ్రత మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని నమ్రత ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ సీక్రెట్ బయటపెట్టారు. మహేష్ బాబు నమ్రత ఇద్దరు కలిసి వంశీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా సమయంలో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యామని తెలిపారు.

ఇలా స్నేహితులుగా మారిన మేము ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకున్నాము మహేష్ వ్యక్తిత్వం ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఇక నా గురించి కూడా మహేష్ తెలుసుకున్నప్పుడే మేమిద్దరం ప్రేమలో పడ్డామని ప్రేమ విషయాన్ని బయటపెట్టిన తర్వాత పెళ్లి అనే ఆలోచన లేకుండా కొద్ది రోజులు ప్రేమలో మునిగి తేలుతూ ఎంజాయ్ చేసామని తెలిపారు.

ఇక పెళ్లి తర్వాత తాను పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నానని నమ్రత వెల్లడించారు. ఇక మహేష్ నా పక్కన ఉంటే నాకు అంతే చాలు నాకు వేరే ప్రపంచంతో అవసరం లేదు. మేమిద్దరం ఏకాంతంగా ఒకే గదిలో ఎన్ని రోజులైనా అలాగే గడుపుతామని, మాకు ఈ లోకంతో పని లేదంటూ నమ్రత తనకు మహేష్ అంటే ఎంత ఇష్టం అనే విషయాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు