Nandamuri Balakrishna: అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బాలయ్య..ఇది ఆయనకే సాధ్యం?

July 10, 2024

Nandamuri Balakrishna: అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బాలయ్య..ఇది ఆయనకే సాధ్యం?

Nandamuri Balakrishna: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సీనియర్ నటుడు బాలకృష్ణ.  ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు బాలయ్య. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ త్వరలోనే బాబి డైరెక్షన్లో చేయబోతున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాగా బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఊర మాస్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బాలయ్యకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా సాధించలేని ఈ అద్భుతమైన రికార్డ్ బాలయ్య సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఏదో ఒక సమయంలో కొంత గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాలలో నటిస్తూ ఉంటారు అలాగే మరికొందరు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతున్న వారు కూడా ఉన్నారు.

అయితే బాలయ్య మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా కూడా తన సినీ కెరియర్ కు బ్రేక్ ఇవ్వకుండా ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాలలో కూడా దూసుకుపోతున్నారు. ఈ నెల 30వ తేదీకి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. బాలకృష్ణ మొదట నటించిన తాతమ్మ కల సినిమా జూలై 30 నాటికి విడుదలై 50 సంవత్సరాలవుతుంది. ఇలా ఒక స్టార్ హీరో కుమారుడు ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు పాటు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది ఒక బాలయ్యకు మాత్రమే దక్కిందని చెప్పాలి.

Related News

ట్రెండింగ్ వార్తలు