భారీగా రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య.. అఖండ 2 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

June 12, 2024

భారీగా రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య.. అఖండ 2 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తున్న బాలకృష్ణ మరోవైపు రాజకీయాలలో కూడా అదే స్పీడ్ కనబరుస్తున్నారు. బాలకృష్ణ ఇటీవల కాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని 100 కోట్ల క్లబ్ చేరుతున్నాయి.

ఇక బాలకృష్ణ చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం ఈయన బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక అఖండ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అయితే ఇటీవల బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఖండ సీక్వెల్ గురించి అధికారక ప్రకటన వెల్లడించారు. ఇక ఈ సినిమా ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు బాలకృష్ణ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారని సమాచారం.

ఇటీవల సినిమాల పరంగా రాజకీయాల పరంగా దూసుకుపోతున్నటువంటి బాలయ్య సక్సెస్ భారీగా అందుకోవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచారట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 23 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య ఈ సినిమాకి ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం. ఇలా బాలయ్య ఒక్కసారిగా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచారని తెలిసి నిర్మాతలు కూడా షాక్ లో ఉన్నారు.

Read More: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంపై చిరు ఆసక్తికర ట్వీట్!

ట్రెండింగ్ వార్తలు