ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరించిన నందమూరి చైతన్య.. ఇదే నా వార్నింగ్ అంటూ!

May 23, 2024

ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరించిన నందమూరి చైతన్య.. ఇదే నా వార్నింగ్ అంటూ!

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య దూరం పెరిగింది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయం అనేక సందర్భాలలో తెర మీదకు వచ్చింది. అయితే ఆ వార్తలపై నందమూరి ఫ్యామిలీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఈ విషయంపై నందమూరి చైతన్య కృష్ణ బహిరంగంగా స్పందించడంతో పాటు ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

నందమూరి చైతన్య కష్ణ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ అభిమానులకి ఇదే నా వార్నింగ్. వైసీపీకి అందులోనూ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఒక్కటే. మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు. అయినా మీరు ఎవరూ మా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్‌ లను టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు, వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు.

జాగ్రత్తగా ఉండండి అంటూ చైతన్య కృష్ణ హెచ్చరించారు. అయితే ఫేస్ బుక్ లో పెట్టిన ఈ పోస్ట్‌పై ఎన్టీఆర్ అభిమానుల స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టును షేర్ చేస్తూ చైతన్య కృష్ణను ఏకిపారేస్తున్నారు. కొందరు ఆశ్చర్యపోతూ ఎన్టీఆర్‌ను ఇందులోకి లాగాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఈ పోస్టు పెట్టడమేంటని, ఎన్నికలకి ముందు పెట్టుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ తెలిసేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: గం గం గణేశా ట్రైలర్ రిలీజ్.. పంచ్ డైలాగులతో అదరగొట్టిన ఆనంద దేవరకొండ!

ట్రెండింగ్ వార్తలు