ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాం.. ఏదో ఒక రోజు నెరవేరుతుంది: అలేఖ్య రెడ్డి

July 7, 2024

ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాం.. ఏదో ఒక రోజు నెరవేరుతుంది: అలేఖ్య రెడ్డి

Nandamuri Alekhya Reddy: అలేఖ్య రెడ్డి పరిచయం అవసరం లేని పేరు దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్యగా ఈమె అందరికీ సుపరిచితమే. నందమూరి తారకరత్న గత ఏడాది మరణించగా ఈమె తన పిల్లలతో కలిసి ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. అలేఖ్య రెడ్డి తారకరత్న ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడంతో తారకరత్న ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తనని దూరం పెట్టారు.

ఇలా తన కుటుంబ సభ్యులు తనని దూరం పెట్టడంతో తారకరత్న తన భార్యతో కలిసి వేరే కాపురం పెట్టారు. ఇలా భార్యా పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో తారకరత్న మరణం పెను విషాదం కలిగించింది. ఇలా తన కొడుకు చనిపోయిన తారకరత్న తల్లితండ్రులు ఏమాత్రం కనికరం లేకుండా తన కోడలు వారి పిల్లలను కూడా దూరం పెట్టారు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం వీరిని చేరదీస్తారని అందరూ భావించినప్పటికీ తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ వీరిని దూరం పెడుతూ వచ్చారు.

ఇక ఈ విషయం గురించి ఒక నెటిజన్ అలేఖ్య రెడ్డిని ప్రశ్నించారు. నందమూరి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆ ఇంటి కోడలిగా అంగీకరిస్తారనే నమ్మకం మీకు ఇంకా ఉందా అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అలేఖ్యరెడ్డి చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒక మనిషిని ఆశ,నమ్మకమే ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు జీవితంలో ముందుకు సాగాము.

తారకరత్న గారు తన జీవితంలో ఎప్పుడు ఆశా నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మేము కూడా ఆ నమ్మకాన్ని వదిలిపెట్టము తప్పకుండా ఏదో ఒక రోజు అది జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఒక ఫ్యామిలీ దొరుకుతుంది అంటూ ఈమె ఆశ భావం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా తన కొడుకు కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంతోనే మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తారకరత్నను దూరం పెట్టారు.

ఇక తారకరత్న మరణించినప్పటికీ కూడా అంత్యక్రియలలో కూడా అంటి ముట్టినట్టు ఈ తల్లిదండ్రులు వ్యవహరించారు. కనీసం తన కోడలిని హక్కున చేర్చుకొని ఓదార్చలేదు. అంతేకాకుండా కొడుకు మరణం తర్వాత కోడలిని దగ్గరకు తీసుకుంటారు అంటే ఇప్పటికి వారిని దూరం పెట్టడం గమనార్హం

Related News

ట్రెండింగ్ వార్తలు