దేవదాసి వ్యవస్థపై నాని శ్యామ్‌సింగరాయ్‌…

December 14, 2021

దేవదాసి వ్యవస్థపై నాని శ్యామ్‌సింగరాయ్‌…
నాని లేటెస్ట్‌ మూవీ ‘శ్యామ్‌సింగరాయ్‌’ ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. ట్రైలర్‌ను బట్టి ఈ సినిమా 6వ శతాబ్ధం నుంచి 13వ శతాబ్ధం వరకు సాగిన దేవదాసీ వ్యవస్థపై సాగే చిత్రంగా తెలుస్తోంది. శ్యామ్‌సింగరాయ్‌ చిత్రంలో వాసు, శ్యామ్‌ పాత్రల్లో నాని కనిపిస్తారు. ఈ చిత్రం రెండు కాలగమనాల్లో సాగుతుంది. ప్రజెంట్‌ నాని, కృతీశెట్టి అయితే..1970లోని బెంగాల్‌ కథలో నాని, సాయిపల్లవి అన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే.. శ్యామ్‌సింగరాయ్‌ చిత్రంలో పునర్జన్మల కాన్సెప్ట్‌ను టాక్‌ చేశారని ట్రైలర్‌ హింట్‌ ఇస్తుంది. మరి..రెండో సినిమాకే దేవదాసి వ్యవస్థ వంటి బలమైన కథాంశాన్ని భుజాన వేసుకున్న ఈ చిత్ర దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తారనేది చూడాలి. వెంకటబోయనపల్లి నిర్మించిన శ్యామ్‌సింగరాయ్‌ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది.ఇప్ప‌టికే 2 మిలియ‌న్ల వ్యూస్ సాధించిన శ్యామ్ సింగ‌రాయ్ ట్రైల‌ర్ మీరు చూసెయ్యండి..

ట్రెండింగ్ వార్తలు