FIR Movie Trailer: ర‌వితేజ సినిమాకి నాని సాయం

February 3, 2022

FIR Movie Trailer: ర‌వితేజ సినిమాకి నాని సాయం

FIR Movie Trailer: కోలీవుడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ రోజు ఎఫ్ఐఆర్ ట్రైల‌ర్‌(FIR Movie Trailer)ను న్యాచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు.

2 నిమిషాల 12 సెకండ్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. అబూ బక్కర్ అబ్దుల్లా అనే భ‌యంక‌ర‌మైన టెర్ర‌రిస్ట్ కార‌ణంగా ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌నేది చిత్ర క‌థ‌గా చూపించారు. ఇర్ఫాన్ అహ్మద్ పాత్ర‌లో విష్ణు విశాల్ ఈజ్‌తో న‌టించాడు. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక తీవ్రవాదుల‌ని నిర్మూలించే ఆఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ న‌ట‌న ప్ర‌త్యేకంగా నిలిచింది. మంజిమా మోహన్ స్క్రీన్ ప్ర‌జెన్స్ ప్ల‌జంట్‌గా ఉంది. అరుల్ విన్సెంట్ కెమెరా ప‌నిత‌నం, అశ్వంత్ సంగీతం ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్స్ అని చెప్పొచ్చు. ఇక డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి.

మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డంతో సినిమాపై మంచి బ‌జ్ నెల‌కొని ఉంది.

Read More: NTR 30: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌ సినిమాలో ఆలియా భ‌ట్ క‌న్ప‌ర్మ్ ఇదిగో ప్రూఫ్‌ ట్రైల‌ర్ మీరు చూసేయండి!

ట్రెండింగ్ వార్తలు