నాని `అంటే సుంద‌రానికీ…షూటింగ్ పూర్తి.

January 24, 2022

నాని `అంటే సుంద‌రానికీ…షూటింగ్ పూర్తి.

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈ సంద‌ర్భంగా “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. #అంటే సుందరానికి“ అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా విడుద‌లైన `అంటే సుందరానికీ..` ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది సినిమాలో నాని పాత్ర పేరు.

అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ట్రెండింగ్ వార్తలు