జాతి రత్నాలు హీరోకి యుఎస్ లో బైక్ యాక్సిడెంట్.. డాక్టర్లు ఏమన్నారంటే!

March 28, 2024

జాతి రత్నాలు హీరోకి యుఎస్ లో బైక్ యాక్సిడెంట్.. డాక్టర్లు ఏమన్నారంటే!

మిస్సెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ నవీన్ పోలిశెట్టి అమెరికాలో యాక్సిడెంట్ కి గురయ్యారంట. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న నవీన్ పోలిశెట్టి కి బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదంలో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయిందని, రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న నవీన్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ యాక్సిడెంట్ జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు విషయం బయటికి రాలేదు. నవీన్ పోలిశెట్టి తన టీం కి ఈ విషయం తెలియజేయడంతో అతనికి యాక్సిడెంట్ అయినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ యాక్సిడెంట్ కు సంబంధించి నవీన్ పోలిశెట్టి అఫీషియల్ గా ఎక్కడా స్పందించకపోవడం విశేషం.జాతి రత్నాలతో మంచి హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి ఆ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో డీసెంట్ హిట్ని అందుకున్నాడు.

ఆ తరువాత అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నారు నవీన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైందా లేదా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోవటం విశేషం. అయితే ఈ సినిమాని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ గత ఏడాది మ్యాడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు.

ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే అతనికి ప్యాన్ ఇండియా లెవెల్ లో అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భాష యాస, వేషధారణ, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ తాను చేసే పాత్రకు తగినట్లుగా మార్చుకుంటాడు. హిందీ మాట్లాడితే అతను కచ్చితంగా నార్త్ కుర్రాడు అనుకుంటారు. అలాంటి టాలెంటెడ్ నటుడు నవీన్ పోలిశెట్టి త్వరగా కోలుకోవాలని మంచి సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని విష్ చేద్దాం.

Read More: మూడు పాటలను పూర్తి చేసుకున్న RC 16..ఈ స్పీడ్ ఏంటి బాసు?

Related News

ట్రెండింగ్ వార్తలు