100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో చేయను.. తెగేసి చెప్పిన నయనతార?

February 28, 2024

100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో చేయను.. తెగేసి చెప్పిన నయనతార?

సౌత్ ఇండియా ఆస్ట్రేలియా లేడీస్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికి వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్న నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుని హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈమెకు ఒక భారీ ఆఫర్ వచ్చిందని కానీ ఆ ఆఫర్ ను నయనతార సున్నితంగా రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ వచ్చినప్పటికీ ఈమె దానిని వదులుకున్నారట. మరి ఈమె వదులుకున్నటువంటి ఆ ఆఫర్ ఏంటి ఏ హీరో పక్కన ఈమె సినిమా అవకాశాన్ని వదులుకున్నారు అనే విషయానికి వస్తే..

తమిళ  హీరో.. అరుళ్ శరవణన్ తో నటించని నయనతార చెప్పినట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 50 ఏళ్లు దాటిన తరువాత  హీరోగా ఎంటర్ అయ్యాడు శరవణన్. బిజినెస్ మెన్ గా కోట్లు సంపాధించిన ఆయన 2002 లో వచ్చిన ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. ఇలా ఈయన ఆలస్యంగా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో భారీ స్థాయిలోనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో ఈయన పక్కన ఊర్వశీ రౌతేలా నటించారు ఈమె ఈ సినిమాలో నటించడం కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందించారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ఊర్వశి కంటే ముందుగా అరుళ్ నయనతారను సంప్రదించారట ప్రతిరోజు తన మేనేజర్ ను నయనతార ఇంటికి పంపించి ఈ సినిమాలో నటించాలని చెప్పేవారట ఆమె ఒప్పుకోకపోవడంతో రెమ్యూనరేషన్ ఎంతైనా ఇవ్వడానికైనా సిద్ధమేనన చెప్పినప్పటికీ తాను 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చిన ఈ సినిమాలో తన పక్కన నటించనని తెగేసి చెప్పారట ఇలా నయనతార భారీ ఆఫర్ వదులుకున్నారని తెలుస్తోంది.

Read More: నాగబాబు పొలిటికల్ కామెంట్స్… వరుణ్ సినిమా ఇబ్బందులలో పడనుందా?

ట్రెండింగ్ వార్తలు