ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. నయనతార కామెంట్స్ వైరల్!

June 20, 2024

ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. నయనతార కామెంట్స్ వైరల్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అందరికంటే అధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి ఇంకా పెళ్లి తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు.

ఇలా సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా నయనతార చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈమె నటించిన సినిమాలలో గజిని సినిమా కూడా ఒకటి. మురగదాస్ దర్శకత్వంలో సూర్య ఆసిన్ నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో నటించగా నయనతార పాత్ర కూడా పరవాలేదనిపించింది. ఈ క్రమంలోనే గజినీ సినిమాలో తన పాత్ర గురించి నయన తార మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో నేను తీసుకున్న చెత్త నిర్ణయాలలో గజిని సినిమాలో నటించడం కూడా ఒకటని తెలిపారు.

ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఒక విధంగా చెప్పారు సినిమా తీసింది మరోలా తీశారని ఈమె తెలిపారు. ఇలా నా పాత్రకు ఏ మాత్రం సంబంధం లేని విధంగా ఈ సినిమాలో నన్ను చూపించారని నయనతార వెల్లడించారు. అయినా తాను ఇలాంటి సినిమాలలో నటించినందుకు ఏమాత్రం బాధపడటం లేదని ఇలాంటి సినిమాలను ఒక గుణపాఠంగా తీసుకుంటాను అంటూ ఈమె గజిని సినిమా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ప్రభాస్ వల్లే నాకు కడుపు వచ్చింది.. దీపికా షాకింగ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు