దేవుడు చాలా మంచోడయ్యా.. అదిరిపోయిన బాలయ్య 109 సినిమా గ్లింప్!

June 10, 2024

దేవుడు చాలా మంచోడయ్యా.. అదిరిపోయిన బాలయ్య 109 సినిమా గ్లింప్!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కెరియర్ పరంగా దూకుడు కనపరుస్తున్నారు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీ అయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ చివరిగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమాని బాబి డైరెక్షన్లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇంకా nbk 109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .

ఇక గ్లింప్స్ లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. అంటూ విలన్ తో డైలాగ్ చెప్పించగా వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు అనే డైలాగ్ తో బాలయ్యకు ఎలివేషన్ ఇప్పిస్తూ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ గ్లింప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇన్ని రోజులు షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నారని ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అఖండ సీక్వెల్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More: హీరోయిన్ల గిఫ్టుల కోసం ఆస్తులను కరిగించిన జగపతిబాబు… ఇలా కూడా చేస్తారా?

ట్రెండింగ్ వార్తలు