అలా పిలిస్తే గౌరవంగా భావిస్తాను.. నేహా శెట్టి కామెంట్స్ వైరల్!

May 28, 2024

అలా పిలిస్తే గౌరవంగా భావిస్తాను.. నేహా శెట్టి కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డిజె టిల్లు సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. ఇందులో రాధిక అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె ని పేరుతో పిలవడం మానేశారు. ఎక్కడ కనిపించినా కూడా రాధిక రాధిక అనే పిలుస్తూ ఉంటారు.

ఇదే విషయం గురించి తాజాగా స్పందించింది నేహా శెట్టి. కాగా విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి కలిసి నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక మూవీ విడుదలకు సిద్దంగా ఉండటం, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేశారు. ఈ క్రమంలో హీరోయిన్ నేహా శెట్టి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అలాగే అనేక రకాల విషయాల గురించి స్పందించింది.

ఈ మూవీ స్క్రిప్ట్ భిన్నంగా ఉంటుందని, ఇందులో ఒక కుటుంబ ప్రయాణం ఉంటుందని తెలిపింది. 90లలో రత్న అనే పాత్రతో పాటు రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. యాక్షన్‌తో పాటుగా రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నీ ఉంటాయని తెలిపింది. విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఫ్రెండ్స్ అయ్యామని, అందుకే ఎటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ తాము ఇబ్బంది పడలేదని అని నేహా తెలిపింది.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది చాలా గొప్ప విషయం. ఏ నటులకైనా అదొక గొప్ప ప్రశంస.. షారుఖ్‌ని బాద్షా అని పిలుస్తుంటారు. అలాగే నా కెరీర్ ప్రారంభంలోనే ఒక కారెక్టర్ నేమ్‌(రాధిక)తో పిలుస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడియెన్స్ హృదయాల్లో రాధిక అనే పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అభిమానంతో రాధిక అని పిలుస్తున్నారని, దాన్ని తాను గౌరవంగానే భావిస్తాను అని తెలిపింది నేహా శెట్టి.

Read More: అది నేనేనా నమ్మలేకపోతున్నా.. జానీ రోజుల్ని గుర్తు చేసుకున్న రేణు దేశాయ్!

ట్రెండింగ్ వార్తలు