విజ‌య్ నువ్వు దేవరకొండ కాదు..అనకొండ

August 26, 2022

విజ‌య్ నువ్వు దేవరకొండ కాదు..అనకొండ

లైగర్‌..రిలీజ‌య్యాక ప‌రిస్థితి వేరుగా ఉంది కాని విడుద‌ల‌కి ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాధ్‌, ఛార్మీ ఈ సినిమాపై మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఒక‌వైపు డ‌బ్బులు లేవ‌ని ఏడుస్తూనే మ‌రోవైపు 200 కోట్ల ఓటీటీ ఆఫ‌ర్‌ని రిజ‌క్ట్ చేశాం అని చెప్పుకొచ్చారు. లైగ‌ర్ సినిమా మేకింగ్‌కి అయిన ఖ‌ర్చు ప్ర‌క్క‌న పెడితే పూరిజ‌గ‌న్నాధ్‌, ఛార్మీ, విజ‌య్ దేవ‌ర‌కొండ ముంబైలో ఉండ‌డానికి అయిన ఖ‌ర్చు 25 కోట్ల‌కు పైగానే..దీంతో ఓ మీడియం రేంజ్ సినిమా తీయోచ్చు. స‌రే ఇంతా ఖ‌ర్చుపెట్టి క‌థ‌పై ఏమైనా వ‌ర్క్ చేశారా అంటే అదీ లేద‌ని ఆడియ‌న్స్‌కి తెలిసిపోయింది. మొత్తానికి పూరి, ఛార్మీ దెబ్బ‌కు విజ‌య్ డైలామాలో ప‌డాల్సివ‌చ్చింది. స‌రే వీరి సంగ‌తి ప్ర‌క్క‌న పెడితే క‌ర‌ణ్ జోహార్ ప‌రిస్థితి మ‌రీ ధారుణం.

అస‌లే బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, కంగ‌నా ర‌నౌత్‌, తాప్సీ సినిమాలు ఆ సినిమా ఖ‌ర్చులు అంటుంచితే ప్ర‌మోష‌న‌ల్ బ‌డ్జెట్ కూడా వ‌సూళు చేయ‌లేక చ‌తికిల‌ప‌డ్డాయి. దానికి బాయ్‌కాట్ నెపోటిజం ఒక కార‌ణం అయితే వాళ్ల నోటిదూల కూడా మ‌రో కార‌ణం. కొంత‌మంది కావాల‌నే బాలీవుడ్ న‌టీన‌టుల‌ని టార్గెట్ చేస్తున్నారు అని తెలిసికూడా మా సినిమాలు చూస్తే చూడండి లేక‌పోతే లేదు అని ప్ర‌క‌టించారు. దాంతో ఒక్క టికెట్ కూడా తెగ‌క మొద‌టి ఆట నుండే షోలు క్యాన్స‌ల్ చేసుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు లైగ‌ర్ కూడా ఆ ఖాతాలో చేరింది…

లైగ‌ర్ సినిమాతో విజ‌య్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. రెండు హిట్‌లు నాలుగు ఫ్లాపులు అన్న‌ట్టుగా ఉంది విజ‌య్ కెరీర్‌..విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే దాదాపుగా డిస్ట్రిబ్యూట‌ర్లు చేతులు ఎత్తేసే ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో కొంత సంయ‌మ‌నం పాటించేది పోయి సూప‌ర్‌స్టార్ హోదా వ‌చ్చింద‌నే ఫీలింగ్‌లో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.అసందర్భప్రేలాపనలే  విజ‌య్ కి ప్ల‌స్సు, అవే మైనస్సు.

ఇటీవ‌ల బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై స్పందిస్తూ విజయ్‌ వాళ్లకు ఎక్కువ అటెన్షన్‌ ఇవ్వకూడదు. వాళ్లని మనం కన్విన్స్‌ చేయలేం. నచ్చితే చూస్తారు లేకుంటే లేదు అంటూ హిందీ చానెల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలపై ప్రముఖ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్‌ మనోజ్‌ దేశాయ్ మ‌రింత ఘాటుగా స్పందించారు.

“చూస్తే చూడండి లేదంటే లేదు అని కామెంట్‌ చేస్తున్నారు. అలా చూడకుండా వదిలేస్తే తాప్సీ పన్ను పరిస్థితి ఏమైంది? ఆమీర్‌ ఖాన్‌ పరిస్థితి ఏమైంది? అక్షయ్‌ కుమార్‌ రక్షాబంధన్‌ ఏమైంది? ఓటీటీలో చూస్తారంటున్నారు. అలాంటప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసుకోండి. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఓటీటీల్లో కూడా మీ సినిమాలు ఎవ్వ‌రు చూడరు. నువ్వు దేవరకొండ కాదు.. అనకొండ.. అనకొండలాగే మాట్లాడుతున్నావు” అంటూ వ్యాఖ్యానించారు.

“మా సినిమాని బాయ్‌కాట్‌ చేసుకోండి అంటూ ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నిర్మాత పరిస్థితి ఏంటి? నీ సినిమా డిస్ట్రిబ్యూటర్‌ పరిస్థితి ఏంటి? సినిమా కోసం పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ పరిస్థితి ఏంటి? వారి గురించి ఆలోచించవా? ఈ హ్యాష్ ట్యాగ్‌ వ్యవహరాల్లోకి నటీనటులు దూరకండి. వాటికి దూరంగా ఉండండి. రాజకీయాలకు దూరంగా ఉండి చూడండి. మీ కెరీర్‌ ఎంత బాగుంటుందో” అంటూ మనోజ్‌ దేశాయ్‌ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు