శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గ గిల్లిన థమన్… మండిపడుతున్న భక్తులు!

June 26, 2024

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గ గిల్లిన థమన్… మండిపడుతున్న భక్తులు!

సినీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల తన కుటుంబంతో సహా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. ఇలా తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈమె బయటికి వస్తున్న సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఆమెకు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే పరస్పరం ఒకరికొకరు క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ విధంగా శ్రీలీలతో మాట్లాడటమే కాకుండా ఆయన తనతో మాట్లాడుతున్న సమయంలో తన బుగ్గ గిల్లడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై ఎంతో మంది భక్తులు నేటిజన్స్ మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి చిలిపి పనులు ఏంటి అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు ఈ వీడియో పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. తమన్ గారికి ఆలయంలో ఎలా ఉండాలి అనే విషయాలను ఆయన ధరించిన దుస్తులు చూస్తేనే అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధమున్న నేపథ్యంలోనే అలా సరదాగా మాట్లాడారే తప్ప దీనిని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ పలువురు మద్దతు తెలుపుతున్నారు.

ఇక శ్రీ లీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు ఇటీవల రవితేజతో మరో కొత్త సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఒకవైపు వైద్య విద్యను కొనసాగిస్తూనే మరోవైపు శ్రీ లీల హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

READ MORESreeleela Stunning Looks Pics

ట్రెండింగ్ వార్తలు