చెప్పులు వేసుకుని దీక్ష చేయడం ఏంటన్నా… ఏపీ ఉపముఖ్యమంత్రి పై భారీ ట్రోల్స్!

June 29, 2024

చెప్పులు వేసుకుని దీక్ష చేయడం ఏంటన్నా… ఏపీ ఉపముఖ్యమంత్రి పై భారీ ట్రోల్స్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్ష వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల  25వ తేదీ ఈ దీక్ష ప్రారంభించిన పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఇక ఈ దీక్ష ప్రారంభం రోజు ఈయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేశారు. ఇలా వారాహి అమ్మవారి దీక్ష వేసిన పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం పండ్లు ద్రవపదార్థాలను మాత్రమే తీసుకోబోతున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఈయన పూర్తిగా పసుపు రంగు దుస్తులను ధరించి నుదటిన బొట్టుతో ఎంతో భక్తి భావంతో కనిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష వేయడంతో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఇలా వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని కనిపించారు. దీంతో వివాదంలో చిక్కుకున్నారు. సాధారణంగా ఏదైనా స్వామివారి మాలను వేసినప్పుడు ఎన్నో నియమనిష్టలను పాటిస్తూ ఉంటారు ఇక చెప్పులు కూడా వేసుకోరు కానీ పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకోవడంతో ఎంతో మంది ఈయన పై విమర్శలు కురిపిస్తున్నారు.

పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హిందూమతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్‌కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అంటూ పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీ రెడ్డి సైతం ఈ విషయంపై స్పందించారు ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోని షేర్ చేస్తూ..బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్ అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు