ఏపీలో నైట్ కర్ఫ్యూ…అయోమ‌యంలో సంక్రాంతి సినిమాలు

January 7, 2022

ఏపీలో నైట్ కర్ఫ్యూ…అయోమ‌యంలో సంక్రాంతి సినిమాలు

Night Curfew: కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకునో లేదా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, రాంగోపాల్ వ‌ర్మ వంటి వారు చేసిన వ్యాఖ్య‌ల‌కు ప‌గ‌సాధింపుగానో తెలీదు కాని రేపో ఎల్లుండో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నైట్ కర్ఫ్యూ ని అమ‌లు చేయ‌బోతుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. రాత్రి 10 గంటల నుండీ ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించబోతుంది.. దాంతో సినిమా థియేటర్లు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ అవబోతున్నాయి. ఇప్పటికే అక్కడ టికెట్ రేట్ల ఇష్యు కారణంగా ఇప్పటివరకు విడుదలైన అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా రిలీజైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేక‌పోయాయి.

Read More: ఇండస్ట్రీలో కరోనా కలకలం…రెండు రోజుల్లోనే ఆరుగురికి పాజిటివ్‌

‘ఆర్.ఆర్.ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డంతో డ‌జ‌నుకి పైగా సినిమాలు ఈ సంక్రాంతి బ‌రిలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు విడుద‌లైన ఆది సాయికుమార్ అతిథి దేవోభ‌వ‌, 1945 సినిమాలు ప్రేక్ష‌కుల్ని పూర్తిగా నిరాశ‌పరిచాయి. దాంతో సంక్రాంతికి వ‌చ్చే సినిమాల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. ఈ క‌రోనా భ‌యాన్ని దాటి సినిమాకు ప్రేక్షకుల‌ని తీసుకురావ‌డం సంక్రాంతికి విడుద‌ల‌య్యే సినిమాల‌కి ఉన్న మొద‌టి టార్గెట్‌. ఈ సంక్రాంతికి ‘ఒక్క బంగార్రాజు’ తప్ప అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కాబ‌ట్టి థియేట‌ర్ స‌మస్య‌లు ఉండ‌క‌పోవ‌చ్చు కాని ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కి రావ‌డానికి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

Read More: కోవిడ్‌ భయంతో వెనక్కి తగ్గిన సల్మాన్‌ఖాన్‌

ట్రెండింగ్ వార్తలు