ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఇక‌లేరు

February 6, 2022

ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఇక‌లేరు

Nightingale of India Lata Mangeshkar reign of cinema: ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ కన్ను మూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ థియేటర్‌ యాక్టర్‌, క్లాసికల్‌ సింగర్‌ అయిన పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్‌ 28న లతామంగేష్కర్‌ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్‌, హృదయనాథ్‌ మంగేష్కర్‌, మీనా కదికర్‌లు లత మంగేష్కర్‌కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు.

ప్రముఖ థియేటర్‌ యాక్టర్‌, క్లాసికల్‌ సింగర్‌ అయిన పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్‌ 28న లతామంగేష్కర్‌ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్‌, హృదయనాథ్‌ మంగేష్కర్‌, మీనా కదికర్‌లు లత మంగేష్కర్‌కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. లత పాఠశాలకు వెళ్లలేదు. ఒక రోజు తన సోదరి ఆశాను తీసుకుని పాఠశాలకు వెళ్లగా, ఉపాధ్యాయులు అనుమతించలేదు. అదే ఆమె పాఠశాలకు వెళ్లిన, మొదటి చివరి రోజు కావటం గమనార్హం. ఆపై సంగీత సాధన మొదలు పెట్టిన ఆమె తండ్రి మరణంతో నటిగా మారాల్సి వచ్చింది. ఒకవైపు నటిస్తూనే, మరోవైపు పాటలు పాడటాన్ని ఆమె ఆపలేదు.

భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్‌. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గానూ తొలిసారి 1969లో పద్మ భూషణ్‌ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత 1999లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2001 భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణ్‌ చేతుల మీదుగా లతా మంగేష్కర్‌ అందుకున్నారు. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే(1989) అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్‌ ప్రభుత్వం ‘ది లీజియన్‌ ఆఫ్ హానర్‌’ పురస్కారం పొందారు.

Read More: ఎన్టీఆర్-కొర‌టాల సినిమా టైటిల్ ఇదేనా?

Related News

ట్రెండింగ్ వార్తలు