బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ హీరోలని నాకు తెలీదు.. నిహారిక సంచలన వ్యాఖ్యలు!

June 15, 2024

బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ హీరోలని నాకు తెలీదు.. నిహారిక సంచలన వ్యాఖ్యలు!

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. నటిగా పలు వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా నిర్మాతగా మారి ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న ఈమె త్వరలోనే కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమాకు నిహారిక నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు.ఇక ఈ టీజర్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి . ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిహారిక మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సీనియర్ హీరోలు అయిన వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి.

చిన్నప్పుడు నేను ఫిలిం ఛాంబర్ లో సినిమాలు చూసేదాన్ని అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదు కనుక తప్పనిసరిగా సినిమాలు చూసే వాళ్ళం. ఇక బ్రేక్ టైం లో స్నాక్స్ కోసం బాగా ఎగబడే వాళ్ళమని అప్పటి రోజులు ఇప్పుడు వస్తే చాలా బాగుంటుందని తెలిపారు. ఇక నేను ఇలా సినిమాలు చూడటం వల్ల మా పెదనాన్న మాత్రమే హీరో అనుకున్నాను ఇక వేరే ఎవరు హీరోలు కాదని భావించాను. బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వీరంతా కూడా సినిమాలు చేస్తున్నారని వీరందరూ హీరోలు అనే విషయం నాకు తెలియదని ఈమె తెలిపారు.

ఇక కొద్ది రోజుల తర్వాత రామానాయుడు స్టూడియో అలాగే ఫిలిం ఛాంబర్లలో వారు నటించిన సినిమాలు చూడటం వల్ల ఓహో వీళ్ళు కూడా హీరోలేనా వీళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారా అని అప్పుడు తెలిసింది అంటూ సరదాగా ఈ విషయాలను నిహారిక అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: బాహుబలి బాటలోనే కల్కి… రెండు భాగాలుగా రానుందా?

ట్రెండింగ్ వార్తలు