Nikhil Siddhartha: లైవ్ వెప‌న్ ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ హీరో

February 20, 2022

Nikhil Siddhartha: లైవ్ వెప‌న్ ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ హీరో

హీరో నిఖిల్ సిద్ధార్థ 19వ చిత్రానికి గుఢ‌చారి, ఎవ‌రు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ఎడ్ ఎంటర్‌టైనమెంట్స్ ప‌తాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ మార్చి నుండి మ‌నాలీలో ప్రారంభమ‌వుతుంది.

ఈ షెడ్యూల్‌లో కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించ‌నుంది యూనిట్. వాటికోసం నిఖిల్(Nikhil Siddhartha) లైవ్ వెప‌న్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ఇదే విష‌యాన్ని సోష‌ల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫోటోల‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో నిఖిల్(Nikhil Siddhartha) సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్త‌య్యింది.

జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, దర్శకుడు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ భాద్య‌త‌ల్ని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

Readmore: Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 త‌ర్వాత సినిమాలు ఫ్లాప్సే కానీ….!

ట్రెండింగ్ వార్తలు