కొన్ని ఏళ్లుగా మూతపడిన ఆలయాన్ని తెరపించిన హీరో నిఖిల్.. గ్రేట్ అంటూ?

June 5, 2024

కొన్ని ఏళ్లుగా మూతపడిన ఆలయాన్ని తెరపించిన హీరో నిఖిల్.. గ్రేట్ అంటూ?

సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈయన హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుందో ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి నిఖిల్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈయన చేసిన మంచి పని పై గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నిఖిల్ ఏం చేశారు ఏంటి అనే విషయానికి వస్తే.. ఇటీవల చీరాలలో పర్యటించినటువంటి ఈయన ఓ గ్రామంలోని ఆలయం గత కొన్ని సంవత్సరాలుగా మూతబడి ఉన్న విషయాన్ని గుర్తించారు.

అయితే త్వరలోనే తిరిగి ఆలయాన్ని తెరపిస్తానని మాట ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారమే నిఖిల్ చీరాలలోని ఆలయ తలుపులు తెరిపించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులందరూ కూడా హీరో నిఖిల్ కి ఘన స్వాగతం పలికారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో శిథిలావస్థకు చేరువలో ఉన్న ఆలయాన్ని ఓపెన్ చేయించడమే కాకుండా ఆలయ బాధ్యతలన్నిటిని కూడా నిఖిల్ తీసుకున్నారు.

ఈ గ్రామంలోకి నిఖిల్ చేరుకోగానే గ్రామస్తులందరూ కూడా ఆయనపై పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Read More: కూటమి విజయంపై స్పందించిన ఎన్టీఆర్.. మామయ్యకు శుభాకాంక్షలంటూ?

ట్రెండింగ్ వార్తలు