ఆ హీరోయిన్‌ పేరు చెప్పండయ్యా!

January 4, 2022

ఆ హీరోయిన్‌ పేరు చెప్పండయ్యా!

ChatrapathiHindiRemake: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ వస్తోంది. ఈ సినిమా టాకీపార్టు కూడా పూర్తయింది. ఒక సాంగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్ ఉంద‌ని చిత్రబృందం చెబుతోంది. కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అన్న విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. చిత్రం యూనిట్‌ కూడా ప్రకటించలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమా అంటే హీరోయిన్ విష‌యంలో అతని తండ్రి బెల్లంకొండ సురేశ్‌ చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. పైగా బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా లాంచ్‌ అయిన తొలి రోజుల్లోనే అప్పటి స్టార్‌ హీరోయిన్స్‌ సమంత, రకుల్, తమన్నా వంటివారితో యాక్ట్‌ చేశాడు. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్‌ డెబ్యూ అంటే బెల్లంకొండ సురేశ్‌ సరసన ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌నే ఎంపిక చేసి ఉంటారు. మరి..టాకీ పార్టు పూర్తయినప్పటికీ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరో చెప్పకపోవడం వెనక ఉన్న మతలబు ఏంటో? వారికే తెలియాలి.

Related News

ట్రెండింగ్ వార్తలు