ఆగస్టు లో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్ కొత్త సినిమా.. వర్కింగ్ టైటిల్ “ఎన్టీఆర్ నీల్”!

May 22, 2024

ఆగస్టు లో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్ కొత్త సినిమా.. వర్కింగ్ టైటిల్ “ఎన్టీఆర్ నీల్”!

జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను సలార్ దర్శకుడు ప్రశాంత నీల్ తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమాను రెండు పార్ట్లుగా తీస్తూ ఉండటంతో ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.దీంతోపాటు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడం వలన సినిమా మరింత లేట్ అవుతుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.

ఆ తరువాత తారక్ నేరుగా బాలీవుడ్ లోకి వెళ్లి హృతిక్ రోషన్ తో కలిసి వార్ టు మూవీ చేస్తాడు. ఇప్పటికే ఈ షూటింగ్లో పాల్గొంటున్నాడు కూడా. ఇలాంటి సమయంలో ప్రశాంత నీల్ డైరెక్షన్లో వచ్చే సినిమా ఇప్పట్లో రాదేమో అని అందరూ భావించారు. హై రేంజ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ చెప్పినప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ప్రేక్షకులు ఎవరు ఆ విషయంపై దృష్టి పెట్టలేదు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. మే 24 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 31 మూవీ నుంచి అతడికి శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్. “ఎన్టీఆర్ నీల్” వర్కింగ్ టైటిల్ తో చిత్ర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ స్టార్ పవర్, ప్రశాంత్ నీల్ విజినరీతో రూపుదిద్దుకునే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కే జి ఎఫ్ లా ఉంటూ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తుందంటున్నారు నిర్మాతలు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు కన్నడంలో కూడా రూపొందిస్తారు.

Read More: కల్కి సినిమాలో రివీల్ అయిన కమల్ రోల్ రన్ టైం.. కళ్ళు చెదిరేలా భారీ ఈవెంట్!

ట్రెండింగ్ వార్తలు