Devara: షూటింగ్ పూర్తిచేసుకున్న తార‌క్‌..స‌ముద్ర‌మంత ప్రేమ‌ను మిస్ అవుతున్నాను అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

August 14, 2024

Devara: షూటింగ్ పూర్తిచేసుకున్న తార‌క్‌..స‌ముద్ర‌మంత ప్రేమ‌ను మిస్ అవుతున్నాను అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న తార‌క్ అభిమానుల నిరీక్ష‌ణ‌కు త్వ‌ర‌లోనే తెర‌ప‌డనుంది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ దేవర మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తార‌క్ ఓ ట్వీట్ చేశారు.

దేవర: పార్ట్ 1లో నా చివరి షాట్ పూర్తయింది. ఇది ఒక‌ అద్భుతమైన ప్రయాణం. నేను సముద్రమంత ప్రేమను మ‌రియు అద్భుతమైన టీమ్ ను మిస్ అవుతాను.సెప్టెంబర్ 27న రాబోతున్న శివ సృష్టించిన ఈ ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ వస్తే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అనే క్యాప్షన్ తో పాటుగా తారక్, కొరటాల శివ ఉన్న దేవర సెట్స్ లోని ఫోటోను జ‌త‌ చేశారు తార‌క్‌.. ఈ పోస్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరి దశ షూటింగ్ ముగించి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు తారక్. మరికొద్ది రోజుల్లోనే దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్.

ట్రెండింగ్ వార్తలు