Devara Preponed: ముందుగా రాబోతున్న దేవర.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

June 14, 2024

Devara Preponed: ముందుగా రాబోతున్న దేవర.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

Devara Movie Release Date: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ చివరిగా RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. దేవర సినిమా పేరిట ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీగా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న సంగతి తెలిసిందే నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. కానీ అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే దేవర సినిమా ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తి కావడంతో సెప్టెంబర్ 27వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల సమయానికి ఎలాంటి సినిమాలు లేకపోవడంతో సోలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని ముందుగా విడుదల చేయడంతో ఏకంగా 50 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు సమాచారం అంతే కాకుండా ఈ సినిమాకు పోటీగా ఇతర సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు