January 27, 2022
NTR-JAHNVI: అతిలోకసుందరి, అలనాటి మేటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ ఇప్పటికే తెలుగులో పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనతో హీరోయిన్ గా పరిచయం కావాల్సింది. కాని మహేష్ చేయాల్సిన ఆ సినిమా కొన్ని అంతర్గత కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే జాన్వీని తెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. అందులో పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంభినేషన్ లో లైగర్ తర్వాత రాబోయే మరో సినిమాతో జాన్వీని తెలుగుకి తీసుకురానున్నారు అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్నాళ్లు చక్కర్లు కొట్టింది.
READ MORE: RGV నన్ను దారుణంగా మోసం చేశాడన్న టాలీవుడ్ బ్యూటీఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా కమిటైన విషయం తెలిసిందే..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న NTR-JAHNVI సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ పర్‌పెక్ట్ ఫిట్ అని, అలాగే జాన్వీతో సినిమాకు పాన్ ఇండియా లుక్ కూడా వస్తుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తోందట. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చేయాల్సింది. ఆ రెండు చిత్రాల తర్వాత ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది.