April 14, 2022
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో తారక్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతం అయింది. కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి అన్ని భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్లో రాజమౌళి ఎన్టీఆర్ పాత్రను చూపించిన విధానంపై ఎన్టీఆర్ అభిమానులు పెదవివిరిచాయి. రామ్ చరణ్‌తో పోలిస్తే ఎన్టీఆర్ పాత్ర బలహీనంగా ఉందనేది వారి వాదన. దీనిపై ఎన్టీఆర్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. వాటికి తారక్ సోషల్‌మీడియా వేధికగా సమాధానం ఇచ్చాడు.
ఎన్టీఆర్ కెరీర్లో ప్రతిష్టాత్మక 30వ చిత్రంగా రూపొందుతున్న చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కొమరం భీమ్ పాత్ర కోసం కొంత బరువుపెరిగిన ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం కంప్లీట్ స్లిమ్‌గా, స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఫిట్ గా ఉండాలని కొరటాల సూచించడంతో అందుకు తగ్గట్లు తారక్ మారిపోయాడని సమాచారం. మాంచి ట్రిమ్డ్ లుక్‌లోకి వచ్చి సరికొత్త స్టైల్లో కనిపిస్తున్న తమ అభిమాన హీరో లుక్‌ని వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆలియా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో ఆలియా ఈ చిత్రం నుండి తప్పుకుందట. ప్రస్తుతం మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్ తో చర్చలు జరుపుతోంది చిత్ర యూనిట్.
ReadMore: కె.జి.ఎఫ్: చాప్టర్ 2 Review and Rating