August 5, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పలువురు డైరెక్టర్లతో సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం రామయ్య వస్తావయ్య. సమంత శృతిహాసన్ ఎన్టీఆర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో గతంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ గారు నా పైన నమ్మకం ఉంచి నాకు ఈ సినిమా అవకాశాన్ని కల్పించారు కానీ ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎలాగైనా ఎన్టీఆర్ గారితో మరో సినిమా చేసి తనకు తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని ఎదురు చూస్తున్నానని ఇప్పటివరకు మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అవ్వడం లేదని తెలిపారు.
ఇక త్వరలోనే హరీష్ శంకర్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రామయ్య వస్తావయ్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి సెకండ్ హాఫ్ కారణమని తెలిపారు ఇందులో మెయిన్ విలన్ సెకండ్ హాఫ్ మొదట్లో చనిపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపి లేదని అలాగే స్క్రీన్ ప్లే కూడా సరిగా రాలేదు అంటూ ఈయన ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి