ఉత్కంఠ‌భ‌రితంగా ఓదెల రైల్వేస్టేష‌న్ ట్రైల‌ర్‌

August 24, 2022

ఉత్కంఠ‌భ‌రితంగా ఓదెల రైల్వేస్టేష‌న్ ట్రైల‌ర్‌

2002లో ఓదెలలో చోటుచేసుకున్న కొన్ని యాధార్ధ సంఘటనల ఆధారంగా సంప‌త్‌నంది క‌థ‌,మాట‌లు తో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ (Odela Railway Station). హెబ్బా పటేల్‌, పూజిత పొన్నాడ, వశిష్ఠ ఎన్‌. సింహ, సాయి రోనక్‌ ప్రధాన పాత్రధారులు. అశోక్‌ తేజ దర్శకుడు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీ ‘ఆహా’లో ఈ నెల 26న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని రిలీజ్ చేసింది

సీరియల్‌ కిల్లర్స్‌.. అప్పుడే పెళ్లి అయిన కొత్త పెళ్లికూతుర్ల‌ని అత్యాచారం చేసి హతమార్చటం, వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించటం తదితర సన్నివేశాలున్న ఈ ట్రైలర్‌ ఉత్కంఠ పెంచేలా ఉంది. ట్రైల‌ర్ చూస్తుంటే సీరియ‌ల్ కిల్లింగ్స్‌ నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే పోలీసు అధికారి అనుదీప్‌ (సాయి రోనక్‌) కిల్లర్స్‌ని పట్టుకున్నారా? అసలు ఓదెలలో అలా ఎందుకు జరిగింది? తెలియాలంటే మ‌రికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ట్రైల‌ర్ మీరు ఓ లుక్కేయండి..

ట్రెండింగ్ వార్తలు