January 7, 2022
Bangarraju, Rowdyboys, Supermachhi: సంక్రాంతి దగ్గరపడుతున్న తరణంలో పండక్కి విడుదలయ్యే చిత్రాలపై మెల్లిగా క్లారిటీ వస్తుంది. సంక్రాంతి చిత్రాల్లో ప్రధానంగా వస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ఈ చిత్రం‘సొగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా రూపొందింది. ఈ బంగార్రాజు చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇక ఇదే రోజున చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ చేసిన ‘సూపర్‌మచ్చీ’, నిర్మాత దిల్ రాజు తమ్ముడు నిర్మాత శీరిష్ తనయుడు ఆశిష్‌రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ‘రౌడీబాయ్స్’ విడుదల అవుతున్నాయి. రౌడీబాయ్స్‌లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఒకే రోజుల నాలుగు సినిమాలు..బంగార్రాజుకు పోటీగా ఆ మూడు చిత్రాలు ఇక మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న హీరో చిత్రం ఈ నెల 15న, ‘ఉనికి’ చిత్రం కూడా ఇదే రోజున విడుదల కానున్నాయి. ఇక ఎమ్‌ఎస్ రాజు ‘7డేస్ 6 నైట్స్’ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read More: నాగార్జునను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…ఆ వ్యాఖ్యలే కారణమా?