January 8, 2022
కన్నడ హీరో యశ్ హీరోగా 2018లో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ ఎంతటి అద్భుత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీస్‌లో పదికిపైగా ప్యాన్ ఇండియన్ మూవీస్ తెరకెక్కుతున్నాయంటే దానికి కారణం బాహుబలి తర్వాత కేజీఎఫ్:చాప్టర్ 1 సాధించిన అద్భుతమే. హీరో యశ్‌ను ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరు, మదర్ సెంటిమెంట్, ఎలివేషన్ యాక్షన్ సీన్స్‌ను ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ‘కేజీఎఫ్:చాఫ్టర్ 2’ గత ఏడాది దసరాకే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల కాలేదు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 14కు కేజీఎఫ్:చాప్టర్ 2ను వాయిదా వేశారు. అన్నీ పరిస్థితులు బాగుంటే కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో వెండితెరపై చూడొచ్చు. ఇక జనవరి 8ప యశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై ఏప్రిల్ 14న విడుదల చేస్తామనే రిలీజ్ డేట్ ఉండటాన్ని గమనించవచ్చు.