February 2, 2022
Gopichand Pakka Commercial Release date: అన్ని సినిమాలు వరుసబెట్టి రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న తరుణంలో తాజాగా మారుతి, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్(Pakka Commercial) సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు నిర్మాతలు. మే 20, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా తెలిపారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారట మారుతి. ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లలో కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు గోపీచంద్. భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ రూపొందింది. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జాక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read More: NTR-JAHNVI: ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్!