వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే ప్రభాస్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

July 1, 2024

వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే ప్రభాస్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Prabhas First Remuneration: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు అన్ని చోట్ల అద్భుతమైన ఆదరణ రావడమే కాకుండా మొదటి రోజు ఏకంగా 200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ప్రభాస్ ఎంతో బిజీగా ఉండటమే కాకుండా ఈయన ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమా కోసం 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఈయన కల్కి సినిమాకు మాత్రం 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు.

ఇలా ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ప్రభాస్ తన మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ 2002వ సంవత్సరంలో ఈశ్వర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన నటన తన కటౌట్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రభాస్.

ఇక ఈశ్వర్ సినిమాలో నటించినందుకు గాను ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ మాత్రం కేవలం నాలుగు లక్షల రూపాయలని తెలుస్తుంది. ఇలా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుని స్థాయి నుంచి నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక కల్కి సినిమా మంచి సక్సెస్ కావడంతో ముందు ముందు ప్రభాస్ చేయబోయే సినిమాలకు కూడా రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి

ట్రెండింగ్ వార్తలు