నరేంద్ర మోడీకి కొడుకు అకీరాను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫోటోస్ వైరల్?

June 6, 2024

నరేంద్ర మోడీకి కొడుకు అకీరాను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫోటోస్ వైరల్?

తాజాగా జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. తెలుగుదేశం జనసేన, బిజెపి పార్టీలు అఖండ విజయాన్ని సాధించాయి. కూటమి విజయం సాధించిన సందర్భంగా ఏపీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నంద‌న్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు.

ప్ర‌ధాని నివాసంలో న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ త‌న కుమారుడు అకిరా నంద‌న్‌ను మోదీకి కి ప‌రిచ‌యం చేశారు. అకిరా కూడా ప్ర‌ధానికి చేతులు జోడించి న‌మ‌స్క‌రించాడు. ఈ సంద‌ర్భంగా మోదీ అకిరా నంద‌న్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నేతలు కామెంట్లు వ్యక్తం చేయడంతో పాటు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా రెండుసార్లు ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మూడోసారి పోటీ చేయగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో 21 స్థానాలలో జనసేన పోటీ చేయగా 21 స్థానాలు గెలవడం గొప్ప విషయమే అని చెప్పాలి.

Read More: ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఉపాసన తాతయ్య.. ఏం జరిగిందో తెలుసా?

Related News

ట్రెండింగ్ వార్తలు