కల్కి ప్రీ రిలీజ్ గెస్ట్ గా పవన్ చంద్రబాబు… నిజమెంత?

June 10, 2024

కల్కి ప్రీ రిలీజ్ గెస్ట్ గా పవన్ చంద్రబాబు… నిజమెంత?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ సినిమా ఈనెల 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించాలని నిర్మాత అశ్వినీ దత్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని ఏపీలోనే నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు రాబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈయన ఈనెల 12వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని ఈ యనతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని తెలుస్తుంది.

ఇక కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథులు గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తల ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ ఫాన్స్ అంచనాలను చేరుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ అందరూ కూడా భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే నటించబోతున్నారు.

Read More: దేవుడు చాలా మంచోడయ్యా.. అదిరిపోయిన బాలయ్య 109 సినిమా గ్లింప్!

ట్రెండింగ్ వార్తలు