ట్రోలింగ్ భరించలేకపోతున్నా.. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన రేణు దేశాయ్!

June 28, 2024

ట్రోలింగ్ భరించలేకపోతున్నా.. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన రేణు దేశాయ్!

సినీ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఈమె తరచూ పవన్ కళ్యాణ్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో నేటిజన్స్ నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా తిరిగే పవన్ కళ్యాణ్ తో కలిసిపోండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాలలో వైరల్ అవ్వడమే కాకుండా ఆమెకు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తనదైన శైలిలోనే వాటిని ఖండిస్తున్నప్పటికీ నేటిజన్స్ మాత్రం వారి ధోరణి మార్చుకోలేదు.. ఇక రేణు దేశాయిని అనడమే కాకుండా తన పిల్లల గురించి కూడా విమర్శలు చేయడంతో ఈమె సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇలా నెటిజెన్స్ పెట్టే కామెంట్లు తనని మానసికంగా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని భావించిన రేణు దేశాయ్ ట్విట్టర్, ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఇంస్టాగ్రామ్ లో మాత్రమే తాను ఉంటున్నానని అయితే ఇంస్టాగ్రామ్ నుంచి వెళ్లిపోవడానికి కుదరదని ఇప్పటికే తాను ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాను వారందరికీ చేరువగా ఉండడం కోసమే ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను అంటూ రేణు దేశాయ్ తెలిపారు.

ఇలా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ భరించే ఓపిక తనకు లేదని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

READ MORE:  Pawan kalyan: ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత!

ట్రెండింగ్ వార్తలు