ఆ పార్టీ గెలిస్తే పవన్ కు ఆ పదవి ఇస్తారా.. ఆ ఎనర్జీ లెవల్ కు అదే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

May 17, 2024

ఆ పార్టీ గెలిస్తే పవన్ కు ఆ పదవి ఇస్తారా.. ఆ ఎనర్జీ లెవల్ కు అదే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇటీవల జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు అయితే ఈసారి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని కూటమిగా ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా ఎన్నికల బరిలో నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తారని అభిమానులందరూ కూడా భావిస్తున్నారు అయితే కూటమి అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడితే ఆయనకు హోం మినిస్టర్ పదవి ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హై ఎనర్జీ లెవెల్స్ ఉన్న వ్యక్తనే సంగతి మనకు తెలిసిందే. ఆయన ఎనర్జీ లెవెల్స్ కి హోం శాఖ అయితే అద్భుతంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అదే విధంగా పొత్తులో భాగంగా కూటమి గెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇలా మంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటే తన సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయంపై కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా సుమారు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన పూర్తిగా రాజకీయాలలో నిమగ్నమైతే సినిమాలకు దూరమవుతారని తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలువురు నిర్మాతలతో సినిమాలకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కొన్ని సినిమాల షూటింగ్స్ దాదాపు 50% పూర్తి చేసినటువంటి పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు ఆ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తారు అనే విషయంపై కూడా అభిమానులలో ఆందోళన నెలకొంది.

Read More: అమెరికాలో అడుక్కుతింటున్నానని ట్రోల్ చేశారు… ఎమోషనల్ అయిన లయ!

ట్రెండింగ్ వార్తలు