కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. సంతోషంలో ఫ్యాన్స్!

June 12, 2024

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. సంతోషంలో ఫ్యాన్స్!
సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంచిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయన జనసేన పార్టీని స్థాపించిన 15 సంవత్సరాలకు తన పార్టీని టిడిపి బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక ఈసారి మాత్రం ఎన్నికలలో గెలిచారు.
ఇలా పార్టీ పెట్టిన 15 సంవత్సరాలకు మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఈయనకు మంత్రి పదవి కూడా లభించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఒకసారిగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయగా వేదికపై ఉన్నటువంటి చిరంజీవి ఎంతో ఎమోషనల్ అయ్యారు. అలాగే తన మూడో భార్య అన్నా మాత్రం ఈ అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధిస్తూ కనిపించారు ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు