బాబాయ్ పాదాలకు నమస్కరించిన గ్లోబల్ స్టార్.. సంస్కారానికి ఫిదా కావాల్సిందే?

June 7, 2024

బాబాయ్ పాదాలకు నమస్కరించిన గ్లోబల్ స్టార్.. సంస్కారానికి ఫిదా కావాల్సిందే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత మొదటిసారి చిరంజీవి ఇంటికి వెళ్లారు.. ఇక పవన్ కళ్యాణ్ వస్తున్నారనీ తెలిసి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా చిరంజీవి నివాసంలో ఉండి ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పవన్ కారు దిగగానే రామ్ చరణ్ అక్కడికి వెళ్లి తన బాబాయ్ కి వెల్కమ్ చెబుతూ తీసుకువచ్చారు. ఇలా ఆయనపై పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తూ వెల్కమ్ చెప్పారు.

ఇక పవన్ కళ్యాణ్ రావడంతో పవన్ దంపతులకు సురేఖ హారతి ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి ఫ్లవర్ బొకే ఇవ్వడంతో చిరంజీవి కాళ్ళపై పడి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ సైతం తన బాబాయ్ మెడలో గులాబీ మాల వేయడమే కాకుండా తన బాబాయ్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ విధంగా రాంచరణ్ తన బాబాయ్ పాదాలకు నమస్కారం చేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రస్తుతం ఈయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది.

ఇలా స్టార్ హీరో అయినప్పటికీ ఆ స్టార్ డం మొత్తం పక్కన పెట్టి తన బాబాయికి ఒక సాధారణ కొడుకు లాగా పాదాభివందనాలు చేయడంతో ఈయన సంస్కారానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మెగా ఇంటిలో జరిగిన ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ కుటుంబం ఎంతోమందికి ఆదర్శం.. కుటుంబం అంటే ఇదే కదా అంటూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Read More: ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చిన బాలయ్య కూతురు.. అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయం?

ట్రెండింగ్ వార్తలు